ఏపీ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల‌.. పోస్టుల వివ‌రాలు ఇవే!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం (AP Govt) నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో రాష్ట్రంలో 10,060 ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఏపీ స‌ర్కార్‌ జాబ్ క్యాలెండ‌ర్-2026 (AP Job Calendar) విడుద‌ల చేసింది. మొత్తం నాలుగు ద‌శ‌ల్లో ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. శాఖ‌ల వారీగా ఏయే విభాగంలో ఎన్ని పోస్టులు గుర్తించార‌న్న‌ది వివ‌రంగా వెల్ల‌డించారు.

తొలిద‌శ‌లో ఇప్ప‌టికే 1,523 పోస్టుల‌ను నోటిఫై చేశారు. రెండో ద‌శ‌లో సెప్టెంబ‌ర్ 15న 3,231 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇందులో గ్రూప్-1 లో 149 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇక మిగ‌తా పోస్టులు ప‌రిశీలిస్తే పోలీస్ కానిస్టేబుల్ 542, సివిల్ ఎస్సై 182 ఉన్నాయి. ఈ దశలో అటవీ శాఖలో కూడా పలు పోస్టులు భర్తీ చేయనున్నారు. అక్టోబ‌ర్ 15న మూడో దశలో 2,311 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. గ్రూప్-2లో 673 పోస్టులు, త‌హ‌సీల్దార్ పోస్టులు 200 ఉండ‌నున్నాయి. నాలుగో ద‌శ‌లో 2995 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో విద్యా శాఖ పోస్టులు ఉండనున్నాయి.

Also Read : చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యత: సీఎం చంద్రబాబు కీలక పిలుపు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>