క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి వివరణ

కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు చిన్నారెడ్డి (Chinna Reddy) కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. గాంధీభవన్ చేరుకున్న ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్‌మోహన్‌కు తాను ఎమ్మెల్యే మేఘారెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై వివరణను అందజేశారు. అలాగే, తాను ఢిల్లీకి వెళ్లడం లేదని.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక మరోకసారి కమిటీని కలుస్తానని చిన్నారెడ్డి వెల్లడించారు.

కాగా, ఇటీవల చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపాయి. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారన్నారు. దీంతో మేఘారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో చెప్పాలని సవాల్ విసిరారు.

ఈ నేపథ్యంలో చిన్నారెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై చిన్నారెడ్డిని వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. దీంతో నేడు (శనివారం) చిన్నారెడ్డి గాంధీభవన్ కు వచ్చి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలను కమిటీకి వివరించారు. అయితే, ఈ వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>