కలం, స్పోర్ట్స్: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా విఫలమవుతున్నారు. శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశపరిచారు. దీంతో ఆయన ఫామ్‌పై ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించారు. యశస్వి రనౌట్ దురదృష్టకరమని అన్నారు.
కానీ ఇలా డకౌట్ అవ్వడంపై జైస్వాల్ సమీక్షించుకోవాలన్నారు. జైస్వాల్ చాలా మంచి ఆటగాడని, కానీ ప్రస్తుత ఫామ్ సహకరించడం లేదని.. మైండ్ సెట్ మార్చుకుని ఆడాలని అశ్విన్ సూచించారు. ఏకాగ్రత పెంచితే మళ్లీ పెద్ద స్కోర్లు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు ఇలాంటి దశ సహజమేనని అండగా నిలిచారు. కాగా, ఈ ఏడాది ఆడిన రెండు టెస్టుల్లో జైస్వాల్ 56 పరుగులు మాత్రమే చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల వద్ద ఆయన రనౌట్ అయ్యారు.

