స్థానిక ఎన్నికలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల వ్యూహానికి భిన్నంగా స్థానిక ఎన్నికలలో జనసేనకు స్థానాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. ఈ ఎన్నికలలో పార్టీ (Jana Sena) పక్షాన అనుసరించే విధివిధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని అన్నారు. ఇందులో ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారని.. 9 నుంచి 11 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారని తేలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలోని డిప్యూటీ సీఎం ఆఫీసులో పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసన సభ పక్షం సమావేశం జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.

జనసైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా లోకల్ బాడీ ఎన్నికలకు (Local Body Elections) సిద్ధం కావాలని కేడర్ కు పవణ్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో ఎంత ధైర్యంగా పోరాడతాయో అందరికీ తెలుసనీ, గత స్థానిక ఎన్నికల్లో పోరాట పటిమను ఎవరూ మరచిపోరని గుర్తు చేశారు. ఆ రోజు నామినేషన్ వేసే పరిస్థితులు లేకుండా అప్పటి పాలకులు ప్రవర్తిస్తే.. వారిని ఎదిరించి పోటీకి నిలిచిన జనసేన నాయకులు, వీర మహిళల స్ఫూర్తిని ఎప్పుడూ విడిచిపెట్టబోమని చెప్పుకొచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>