22-A భూముల వెనుక పెద్ద కుట్ర: హరీష్ రావు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో భూములను రాత్రికి రాత్రే 22-A నిషిద్ధ జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ (Harish Rao) రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దశాబ్దాల తరబడి నివసిస్తున్న ఇళ్లు, ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ (ULC) మినహాయింపులు ఇచ్చిన జీవోలు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వేలాది భూములు, అలాగే హెచ్ఎండీఏ (HMDA), హుడా (HUDA) సంస్థలు స్వయంగా లబ్ధిదారులకు వేలంలో విక్రయించిన భూములను నిషిద్ధ జాబితాలో చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ ఆయన ఆరోపించారు. నగరం మొత్తం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల్లోకి వెళ్లేందుకే ఈ రీతిలో నిషేధం విధించారని హరీష్ రావు విమర్శించారు.

ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఆస్తులను మార్చుకోవడానికి సబ్‌ రిజిస్ట్రార్ నుంచి ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్, చివరికి ULC కార్యాలయం చుట్టూ అధికారులు తిప్పుకుంటుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. అశోక్ రెడ్డి అనే బాధితుడి తన తాత నివసించిన ఇల్లును అత్యవసరాల కోసం అమ్మేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే అది నిషిద్ధ జాబితాలో ఉందంటూ రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలు, అక్రమాల వల్ల ప్రజలు నిత్యం తీవ్ర నరకం అనుభవించాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు.

నిషేధం తొలగించాలి..

అక్రమంగా నిషేధిత జాబితాలో ఉంచిన పేదల ఇళ్లను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>