భార్య హ‌త్య‌.. ప్ర‌మాదంగా చిత్రీక‌ర‌ణ‌.. ఆర్మీ జ‌వాన్ హైడ్రామా!

క‌లం, వెబ్‌డెస్క్‌: పంజాబ్‌ (Punjab)లో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. భార్య‌ను చంపిన ఓ ఆర్మీ జ‌వాన్ (Army Jawan) త‌ర్వాత దాన్ని ప్ర‌మాదంగా చిత్రీక‌రించాడు. కానీ, కుటుంబ‌స‌భ్యుల అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా అస‌లు విష‌యం వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న‌ పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో జరిగింది. స్థానిక‌ బీఎస్ఎఫ్ జవాన్ అమర్‌జిత్ సింగ్‌కు 12 ఏళ్ల క్రితం రమాతో వివాహం జ‌రిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమ‌ర్‌జిత్ ఈ నెల 13న సెలవుపై ఇంటికి వ‌చ్చాడు. ఈ స‌మ‌యంలో భార్య‌తో గొడ‌వ‌ప‌డ్డాడు.

మాటా మాటా పెర‌గ‌డంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్ర‌మైంది. అమ‌ర్‌జిత్ క్ష‌ణికావేశంలో భార్య‌పై భౌతిక దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో రమా మృతి చెందింది. దీంతో ఈ హ‌త్య నుంచి త‌ప్పించుకునేందుకు అమ‌ర్‌జిత్ పెద్ద స్కెచ్ వేశాడు. ర‌మా ఇంటి పై నుంచి కింద ప‌డింద‌ని డ్రామా మొద‌లు పెట్టాడు. భార్య మృత‌దేహాన్ని తీసుకెళ్లి ర‌మాను ఆస్ప‌త్రిలో చేర్చిన‌ట్లు ఫ్యామిలీకి చెప్పాడు. రమా ఫ్యామిలీ హుటాహుటిన‌ ఆస్పత్రికి చేరుకుంది. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యుల ద్వారా తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విల‌పించారు.

అదే స‌మ‌యంలో కొంద‌రు కుటుంబ‌స‌భ్యులు ర‌మా శ‌రీరంపై గాయాలు ఉండ‌టం గ‌మ‌నించారు. దీంతో అనుమానం వ‌చ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి అయిన‌ప్ప‌టి నుంచి అమర్‌జిత్ తమ కుమార్తెను వేధించడంతో పాటు కొడుతున్నాడని ఫిర్యాదులో ఆరోపించారు. రంగంలోకి దిగిన‌ పోలీసులు త‌మ స్టైల్‌లో ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో అమర్‌జిత్ సింగ్‌ సహా మరో ఇద్దరి కుటుంబ సభ్యులపై నమోదు చేసి అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>