మున్నూరు కాపు సంఘానికి నూతన కార్యవర్గం

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్ (Bangalpet) మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా సంతోష్, ప్రధాన కార్యదర్శిగా భూమేష్ ఎన్నికయ్యారు. కోశాధికారులుగా మహేష్, యువరాజ్, ఉపాధ్యక్షులుగా అమరేందర్, కిషన్, గంగాధర్, శ్రీధర్, రాములు ఎంపికయ్యారు. ఉప కార్యదర్శులుగా గజ్జారాం, వెంకటేష్, సురేందర్ ఎన్నికయ్యారు. ప్రచార కార్యదర్శిగా నర్సయ్యను, లీగల్ అడ్వైజర్‌గా తుకారాంను ఎన్నుకున్నారు. సలహా సభ్యులుగా గంగాధర్, తోట సృజన్, నర్సయ్య, శివరాజు, మల్లేష్, నవీన్, శ్రీనివాస్, నవీన్ కుమార్, రమేష్, నారాయణ, చిన్న పోశెట్టి, రమేష్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి, మున్నూరు కాపు సంఘం సభ్యుల సంక్షేమానికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>