జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసు ఉపసంహరించుకోవాలి: బుర్ర సంపత్

క‌లం, క‌రీంన‌గ‌ర్‌: హుజురాబాద్ జర్నలిస్టులకు (Huzurabad Journalists) ఇచ్చిన ఇళ్ల స్థలాల పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు వేసిన కేసును ఉపసంహరించుకునేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని టీయుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ గౌడ్ (Burra Sampath) డిమాండ్ చేశారు. హుజురాబాద్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై కేసు వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వామి రెడ్డి వైఖరిని నిరసిస్తూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరానికి హాజరై వారికి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల పట్ల గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా వివక్ష చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో హుజరాబాద్ లో జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఇండ్ల స్థలాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు కేసు వేయడం విచారకరమన్నారు. నాటి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించక పోగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండున్నర ఏళ్ళు గడుస్తున్నా కూడా సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. తాము అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు గుప్పిస్తున్న ఆయా పార్టీలు జర్నలిస్టులను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టో లో జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని, తమ సంక్షేమానికి కట్టబడి ఉంటామని పేర్కొంటున్న ప్రభుత్వాలు తమని పూర్తిగా అన్యాయానికి గురి చేస్తున్నాయని మండి పడ్డారు.

తాము కూడా ఓటర్లమే అన్న విషయాన్ని ఈ ప్రభుత్వాలు మరచి పోతున్నాయని అన్నారు. హుజూరాబాద్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విషయమై జర్నలిస్టులు పలుసార్లు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి తమ నాయకుడు వేసిన కేసును ఉసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని విన్నవించినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదని అన్నారు. గత నెల రోజులుగా జర్నలిస్టులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినా కూడా ఏ మాత్రం స్పందించడం లేదని అన్నారు. ఈ సమస్యను రాష్ట్ర నాయకత్వ దృష్టికి తీసుకవెళతామని అన్నారు.

ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పార్టీ నాయకులు స్పందించి హుజురాబాద్ జర్నలిస్టుల (Huzurabad Journalists) ఇంటి స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని బుర్ర సంపత్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, ప్రధాన కార్యదర్శి కామిని రవీందర్, సీనియర్ జర్నలిస్టులు కోరేము సుధాకర్ రెడ్డి, నరసింహ రెడ్డి, జర్నలిస్టులు సమ్మెట సతీష్, సంపత్, కేదాసి శ్రీధర్, సాయికృష్ణ, బొడ్డు శ్రీనివాస్, చందు, సాగర్, రాజు, ఆయా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : నల్లతుమ్మ పేరుతో సండ్ర కలప స్మగ్లింగ్.. ఖమ్మంలో గుట్టురట్టు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>