లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన రైల్వే ఇంజినీర్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో ప‌లు చోట్ల‌ సీబీఐ (CBI) అధికారులు ఆదివారం ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో లంచం కేసులో విజ‌య‌వాడ‌లో ఓ రైల్వే ఇంజినీర్ సీబీఐ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. విజయవాడలోని సౌత్ సెంట్ర‌ల్ రైల్వేకు చెందిన చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ బాపిరాజు, యెల్లా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కుమారుడైన శ్రీచంద్‌ను సీబీఐ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

సౌత్ సెంట్ర‌ల్‌ రైల్వే నుంచి రూ.179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న గణపతి ఇంజనీరింగ్ వర్క్స్, యెల్లా కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ పనులను నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేసింది. దీంతో సుమారు రూ.7 కోట్ల బోనస్ క్లెయిమ్ కోసం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ బోనస్ ఫైల్‌ను త్వరగా ఆమోదించి, కాంట్రాక్టర్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు సీఎస్‌టీఈ ప్రాజెక్ట్స్ అధికారులు తేదీలను తారుమారు చేసి అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది.

విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్న సమయంలో ప్రైవేట్ కంపెనీ ఎండీ కుమారుడు లంచం సొమ్మును అందజేస్తాడని నిందితుడు ఇంజనీర్‌కు సమాచారం అందించారు. ఈ సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ (CBI) అధికారులు పక్కా స్కెచ్‌తో ప్రైవేట్ వ్యక్తి నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటున్న ఇంజనీర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, విజయవాడ, పి0ఠాపురం, హైదరాబాద్‌లోని నిందితుల నివాసాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.

 Also Read : తిరుమలకు తీసిపోని తిరుమలయ్య గుట్ట..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>