విమల్ యాడ్‌ ఎఫెక్ట్.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు

కలం, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షాకిచ్చింది. ప్రముఖ పాన్ మసాలా బ్రాండ్ విమల్‌ (Vimal Elaichi Ad) కు సంబంధించిన ప్రకటనలో నటించినందుకు వీరికి FDA అధికారులు నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన అంశంపై ఈ నోటీసులు జారీ చేసింది.

విమల్ యాడ్‌ (Vimal Elaichi Ad) ప్రకటన ద్వారా సదరు హీరోలు పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించి, ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారనే ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర FDA తాజా నిర్ణయం తీసుకుంది. తప్పుడు ప్రకటనలు ఇచ్చే సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కార్యకర్తల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్యానికి హానికరమై ఉత్పత్తులను ప్రచారం చేసే ప్రముఖులపై చర్యలు అవులవుతున్న వేళ బాలీవుడ్ స్టార్ హీరోలకు ఈ నోటీసులు జారీ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ నోటీసులకు బాలీవుడ్ స్టారో హీరోలు ఎలాంటి సమాధానం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : సీఎంను చంపేస్తానంటూ బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>