నల్సార్ విద్యార్థులకు బీసీఐ అధ్యక్షుడి క్షమాపణలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా (Manan Kumar Mishra) క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. తన ఉత్తర్వుల ద్వారా విద్యార్థుల మనోభావాలను గాయపరిచి ఉంటే క్షమించాలని కోరారు. భారత న్యాయ వ్యవస్థలో లా విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమైందని పేర్కొన్న మనన్ కుమార్ మిశ్రా, వారు ఎవరో ఒత్తిడికి లొంగే స్వభావం కాదన్నారు. ఈ దేశ రాజ్యాంగం పట్ల వారికి ఉన్న అవగాహన అత్యుత్తమమైందన్నారు.

వారంతా భవిష్యత్తులో లాయర్లు, అడ్వకేట్లుగా, జడ్జిలుగా, మరికొందరు అత్యున్నత స్థానాలు అధిరోహించే సామర్థ్యం ఉన్న వారని మనన్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. అందుకే, వారిని క్షమాపణ కోరడం అంటే ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని.. విద్యార్థుల ఆందోళనలకు విలువ ఇవ్వడమే అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయ విద్యార్థులు అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు మూడు పేజీల లేఖలో వివరించారు.

వివాదం ముదరడంతోనే..

నల్సార్ విద్యార్థులను బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోకుండా తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు మనన్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. సీజేఐ సూర్యకాంత్ కూడా స్వయంగా కల్పించుకుని.. బీసీఐ జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన మనన్ కుమార్ మిశ్రా, లేఖను వెనక్కి తీసుకోవడంతో పాటు తాజాగా క్షమాపణలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో వివాదం ఇంతటితో ముగుస్తుందా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>