రాష్ట్రపతి మెడల్ గ్రహీతకు సీపీ గౌష్ ఆలం అభినందనలు

కలం, కరీంనగర్: రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్‌కు ఎంపికైన కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి.వెంకట రమణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) శనివారం ఘనంగా సన్మానించి అభినందించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా అంకితభావంతో, సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందించినందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడం గర్వకారణమని సీపీ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ వెంకట రమణకు కమిషనరేట్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>