కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం కారణంగా పవన్ కళ్యాణ్ సాయంత్రం అమరావతిలో జరిగే ఎట్ హూం కార్యక్రమానికి హాజరు కావడం లేదని డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
వైద్య పరీక్షల అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లనున్నారు. ఇటీవలే ముంబయిలో కుడి భుజానికి రొటర్ కఫ్ ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్.. మంగళగిరిలోని తన కార్యాలయానికే పరిమితమయ్యారు. మరోసారి అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఉదయం కాకినాడ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.

