నిర్మల్‌లో రేపు భారీ తిరంగా ర్యాలీ

కలం, నిర్మల్: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీని (Tiranga Rally) విజయవంతం చేయాలని కార్యక్రమ జోనల్ కన్వీనర్ రావుల రాంనాథ్ పిలుపునిచ్చారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రావుల రాంనాథ్ మాట్లాడుతూ.. గురువారం జిల్లా కేంద్రంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.

ఉదయం 10.30 గంటలకు అంబేద్కర్ చౌక్ నుంచి వివేక్ చౌక్ వరకు తిరంగా ర్యాలీ (Tiranga Rally) కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులు, దేశభక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రావులవార్ విఠల్, జింక సూరి సూరజ్ నాయక్, పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, నాయకులు మెడిసెమ్మరాజు, గణేష్, శ్రీనివాస్, నవీన్, నరేందర్, అర్జున్, ఆనంద్, విజయ్, వెంకటేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్ ప్రభుత్వంపై కూనంనేని హాట్ కామెంట్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>