కేరళ కాదు కేరళం.. పేరు మార్పు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కలం, వెబ్ డెస్క్ : కేరళ పేరు మారింది. ఈ రాష్ట్రం పేరును కేరళం (Keralam) గా మార్చుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో పేరు మార్పు బిల్లుకు లోక్ సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, కేరళ ప్రభుత్వం రాష్ట్రం పేరును మార్చాలని కేంద్రాన్ని కోరింది.

పేరు మార్పుపై గతంలో కేరళ అసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేస్తూ కేంద్రానికి పంపింది. చాలా కాలం పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనను ఫిబ్రవరిలో కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. కేంద్ర క్యాబినెట్ పరిగణలోకి తీసుకోగా, మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేరళ పేరును కేరళం గా మార్చుతూ సభ ఆమోదం తెలిపింది.

Also Read : ప్లాస్టిక్ నోట్లపై కేంద్రం సంచలన ప్రకటన

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>