పార్లమెంట్‌లో ప్రతిపక్షాల కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్ (Parliament) సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పీఠముడి నెలకొంది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు సమాధానం చెప్పాల్సిందేనని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయనకు మద్దతు తెలపడంతో రోజూ సభలు వాయిదా పడుతున్నాయి.

ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పది గంటలకు పార్లమెంట్‌లో అన్ని ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆఫీసులో జరిగే ఈ సమావేశానికి రాహుల్ గాంధీ సహా కీలక ఎంపీలు హాజరు కాబోతున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు. అనంతరం 10.30 గంటలకు పార్లమెంట్ ఎదుట నిరసన చేపట్టబోతున్నారు.

పదే పదే మాట మారుస్తూ..

అమిత్ షా సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు పదే పదే మాట మారుస్తూ.. సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనపై సమాధానం ఇవ్వడానికి అమిత్ షా రెడీగా ఉన్నారని తెలిపారు. అయితే రాహుల్ ఆరోపిస్తున్నట్లుగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించలేదని జేపీ నడ్డా స్పష్టం చేశారు. అలాంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వలేదని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>