భద్రాచలంలో మిన్నంటిన ‘ప్రపంచ ఆదివాసి దినోత్సవ’ వేడుకలు!

కలం, భద్రాచలం: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా భద్రాచలం(Bhadrachalam)లో గిరిజన సంస్కృతీ సాంప్రదాయాల కోలాహలం మిన్నంటింది. ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు, వేడుకల నడుమ పండుగ వాతావరణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ సెంటర్ సమీపంలోని ఆదివాసి అమరవీరుల మూడు విగ్రహాల వద్ద ఐటీడీఏ పీవో బి. రాహుల్ పర్యవేక్షణలో ఈ వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకటరావు ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు, గ్రామపంచాయతీ సర్పంచ్ పున్నెం కృష్ణ, ఆదివాసి సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ తెల్లం రమణయ్య, కో-కన్వీనర్ ముర్లా రమేష్, కుంజ ధర్మ, గుండు శరత్‌లతో పాటు సుమారు 250 మందికి పైగా ఆదివాసీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.​కార్యక్రమంలో భాగంగా నాయకులు ముందుగా ఆదివాసి జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఆదివాసి అమరవీరులైన అల్లూరి సీతారామరాజు, ఘాం గంటన్న దొర, మల్లు దొరల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి బయలుదేరిన భారీ ర్యాలీ ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసింది. తిరిగి అంబేద్కర్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, పాత మార్కెట్ సెంటర్‌లోని అమరవీరులు రాణి దుర్గావతి, కొమరం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నీరాజనాలు అర్పించారు. అనంతరం ఈ ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో ఐటీడీఏ గిరిజన భవనం వరకు కొనసాగింది. గిరిజన భవనం చేరుకున్న పిమ్మట ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఘనంగా ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>