రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వంజర్ గ్రామానికి చెందిన ముక్కెర భోజన్న అనారోగ్యంతో హైదరాబాద్‌ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని అన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యేకు భోజన్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>