ఆధార్ కార్డుతో బియ్యం పంపిణీ: నాదెండ్ల మనోహర్

కలం, వెబ్ డెస్క్: రేషన్ కార్డ్ లేకపోయినా ఆధార్ కార్డుతో పది కిలోల బియ్యం పంపిణీ చేయాలని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. తక్కువ ధరకే బియ్యం విక్రయాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి వివరించారు. గ్రామాల్లో సరఫరాను మరింత పెంచాలని.. ఎక్కడా బియ్యం కొరత రాకుండా డీలర్లతో నిరంతరం సమీక్ష చేస్తుండాలని సూచించారు.

బీపీటీ రైస్ అతి తక్కువ ధరకే..

బహిరంగ మార్కెట్‌లో అత్యధిక ధర పలికే బీపీటీ సూపర్​ ఫైన్ రైస్ కిలో రూ.52 అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. గ్రేడ్ వన్ రా రైస్ కూడా రూ.50 అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక రైస్ మిల్లర్ల కౌంటర్లతో అతి తక్కువ ధరకే ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు నాణ్యమైన బియ్యం అందించే లక్ష్యంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>