కేంద్రం తీరుపై సిపిఐ ఆగ్రహం: కరీంనగర్‌లో ‘ప్రచార జాతా’!

కలం, కరీంనగర్ బ్యూరో : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పేద సామాన్య ప్రజలపై భారం వేసేందుకు అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచి పెను భారం మోపడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సిపిఐ (CPI Karimnagar) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాతా శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, గుంటూరుపల్లి, మొగ్దుం పూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది.

బొమ్మకల్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేదలకు విద్యా, వైద్యం అందుబాటులో లేకుండా చేస్తుందని, ఏటా రెండు కోట్ల ఉద్యాగాలు ఇస్తామని మోడీ చెప్పడంతో డిగ్రీలు చేతపట్టుకొని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, ఉద్యోగాలు కాదు కదా ఉపాధి అవకాశాలు కూడా చూపడంలో మోడీ వైఫల్యం చెందారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ (CPI Karimnagar) రూరల్ మండల ఇంచార్జి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు, పైడిపల్లి రాజు, ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీర్ల పద్మ, కొట్టె అంజలి, పోలోజు రంజిత్, బామండ్లపెల్లి యుగేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కసిబొజుల సంతోష్ చారి, సిపిఐ శాఖ కార్యదర్శులు బాకం ఆంజనేయులు, తంగెళ్ళ సంపత్, చిందం మల్లయ్య, కాల్వ కొమురయ్య, నాయకులు బీర్ల స్వాతి, మేకల రమ్య నునావత్ శ్రీనివాస్, కసిరెడ్డి సందీప్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read : హ‌స్తం పార్టీలో సోష‌ల్ మీడియా ప‌ద‌వులు.. బీఆర్ఎస్ సెటైర్లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>