ఘణపురంలో కుమ్మర్ల ఐక్యత సభ

కలం, వనపర్తి: బోనాల పండుగలో కుమ్మరి కుండకు ప్రత్యేక స్థానం ఉందని, హైదరాబాద్ గోల్కొండ బోనాలతో పాటు తొలి బోనం కూడా కుమ్మరి వర్గానికే దక్కడం వారి సంప్రదాయ వైభవానికి నిదర్శనమని కుమ్మరి సంఘం నాయకులు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం (Ghanpur) మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో గురువారం ఐక్యత సభలో వారు మాట్లాడారు.

కార్యక్రమానికి ముందు ఈదమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి పద్మశాలి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ చేపట్టారు. మండల అధ్యక్షుడు కుమ్మరి శ్రీను అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయానంద్, జిల్లా అధ్యక్షుడు సూగూరు రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

వక్తలు మాట్లాడుతూ.. కుమ్మరి వృత్తి పర్యావరణహితమైనదని, మట్టితో తయారుచేసే కుండలు, పాత్రలు, ప్రమిదలు, రంజన్లు భారతీయ సంస్కృతికి ప్రతీకలని అన్నారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పూడిక మట్టిని కుమ్మరులకు ఉచితంగా తవ్వుకొని రవాణా చేసుకునేలా ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మైనింగ్, రెవెన్యూ శాఖల వేధింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

కుమ్మరులకు ఎలక్ట్రిక్ చక్రాలు, ఉపాధి రుణాలు, ఉచిత విద్యుత్, వృత్తి బీమా, పింఛన్, విక్రయ కేంద్రాలు కల్పించాలని కోరారు. కుమ్మర ఫెడరేషన్, కార్పొరేషన్‌కు ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా, జిల్లా, మండల స్థాయి కుమ్మరి సంఘాల నాయకులు, మహిళా సంఘం ప్రతినిధులు, యువజన సంఘం నాయకులు, 15 మండలాల కుమ్మరి సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>