ఉపాధి పేరుతో మోసం.. జగిత్యాల యువకుడి ఆవేదన

కలం, జగిత్యాల: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన జగిత్యాల (Jagtial) జిల్లాకు చెందిన యువకుడు ఏజెంట్ చేసిన మోసంతో అర్మేనియాలో దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులు పడుతున్నాడు. మల్యాల మండలానికి చెందిన గంగకిషన్‌ను రష్యాకు పంపిస్తానని శ్రీనివాస్ అనే ఏజెంట్ నమ్మించాడు. లక్షల రూపాయలు తీసుకుని రష్యా బదులు అర్మేనియాకు పంపించేశాడు. అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకే గంగకిషన్ వద్ద ఉన్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు. పాస్‌పోర్ట్ కూడా పోవడంతో చేయూత ఇచ్చేవారు లేకుండా పోయారు.

కాపాడాలని వేడుకోలు..

ఈ మేరకు గురువారం గంగకిషన్ సోషల్ మీడియాలో గంగకిషన్ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. “నన్ను కాపాడండి. రష్యా అని చెప్పి అర్మేనియాలో వదిలేశాడు. డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. దయచేసి నన్ను స్వదేశానికి రప్పించండని ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను ఉద్దేశించి తనను స్వదేశానికి రప్పించాలి” అని వేడుకున్నాడు.

ఏజెంట్ శ్రీనివాస్ వేరే దేశం పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని గంగకిషన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్‌ను కోరారు. కాగా, విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఇలాంటి మోసపూరిత ఏజెంట్ల బారిన పడొద్దని, ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెన్సీల ద్వారానే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>