కలం, నిర్మల్: ముధోల్ (Mudhole) నియోజకవర్గంలోని పలు ఆలయాల నిర్మాణం, పునర్నిర్మాణ పనుల కోసం రూ.1.50 కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ గురువారం తెలిపారు. ముధోల్ మండలం ఎడ్బిడ్ తండాలో జగదాంబ సేవాలాల్ ఆలయానికి రూ.22.14 లక్షలు, కుబీర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయానికి రూ.8.28 లక్షలు మంజరైనట్లు తెలిపారు. అలాగే బాసర మండలం దోడాపూర్ గ్రామంలోని మహాదేవ్ మందిర కళ్యాణ మండపానికి రూ.22.75 లక్షలు, నర్సాపూర్ (జి) మండలం గొల్లమాడ గ్రామంలోని బీరప్ప ఆలయ పునర్నిర్మాణానికి రూ.18.33 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు.
తానూర్ మండలం హంగిర్గా గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.32.71 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ మంత్రికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.

