కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డ్రైనేజీ, రోడ్లు, పుట్ పాత్ ఆక్రమణలపై గద్వాల మున్సిపల్ (Gadwal Municipality) అధికారులు కొరడా ఝళిపించారు. పట్టణం ప్రధాన రహదారిలో గల ఇండ్లు, దుకాణాల ముందు రోడ్లను, డ్రైనేజీలను ఆక్రమించుకుని స్లాబ్‌లు వేసి మూసివేయడంతో వర్షపు నీరు నిలిచిపోయే రోడ్లపై పారుతోంది. దీనివల్ల అనేక రకాల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఆపరేషన్ రోప్‌లో భాగంగా ఫుట్‌పాత్‌లపై, రహదారులకు ఇరువైపుల వెలసిన దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఈ ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం కొత్తబస్టాండ్, సుంకులమ్మ మెట్టు, గర్ల్స్ హైస్కూల్ వరకు జేసిబిలతో అక్రమణలను తొలగింపు కార్యక్రమం చేపట్టారు. విడతల వారిగా ఎంక్రోచ్మెంట్ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని మున్సిపల్ (Gadwal Municipality) అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా గద్వాల మున్సిపల్ కమీషనర్ జానకీరాం సాగర్ మాట్లాడుతూ…గద్వాల మున్సిపాలిటి పరిధిలో ఇష్టానుసారంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించిన ప్రదేశంలో తిరిగి ఎవరైనా డబ్బాలు ఏర్పాటు చేసిన ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.
Also Read : పంట మార్పిడి విధానాలు పాటించాలి.. రైతులకు కోదండ రెడ్డి పిలుపు
Follow Us On : WhatsApp

