కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు (మంగళవారం) రాత్రి ఢిల్లీకి (CM Revanth Reddy Delhi Visit) బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు జరిగే పర్యటనలో రేవంత్ కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులు, అంతర్రాష్ట్ర జలవివాదాలు, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులతో రేవంత్ కీలక చర్చలు జరుపుతారు.
రాష్ట్రంలో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులు, అంతర్రాష్ట్ర జల వివాదాల అంశాలపై కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్రయాదవ్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చర్చించనున్నారు. కృష్టా, గోదావరి జలాల అంశంలో ఆంధ్రప్రదేశ్ తో తలెత్తిన విభేదాలతో పాటు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై సీఆర్ పాటిలతో సీఎం రేవంత్ ప్రధానంగా చర్చించనున్నట్లు సమచారం.

