రీల్స్ చేయడంపైనే సీఎం విజయ్ శ్రద్ధ: స్టాలిన్

కలం, వెబ్ డెస్క్: సీఎం విజయ్ (CM Vijay) ప్రజా సేవ కంటే సోషల్ మీడియాలో రీల్స్ చేయడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కుమారుడు, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అరెస్టుపై తొలిసారి స్పందించిన ఆయన.. సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. కావేరి నీటి గురించి, కర్ణాటక నిర్మించబోతున్న మేకధాతు ప్రాజెక్ట్ గురించి గట్టిగా మాట్లాడలేని అసమర్థ ముఖ్యమంత్రి విజయ్ అని ధ్వజమెత్తారు. రైతులు నీళ్లు రావడం లేదని బాధపడుతుంటే.. విజయ్, మంత్రులు ఆయన నటించిన సినిమా గురించే ఎక్కువ బాధపడుతున్నారని.. జోకర్ క్యాబినెట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చెన్నైలోనే ఎందుకు విచారించలేదు..

ఉదయనిధి అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు రావడంతో విజయ్ ప్రభుత్వం కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తోందని స్టాలిన్ (MK Stalin) ఆరోపించారు. ఉదయనిధిని విచారించి, పంపించేస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో చెప్పారని.. అలాంటప్పుడు తంజావూరు వరకు తీసుకెళ్లడం ఎందుకన్నారు. చెన్నైలోనే విచారిస్తే సరిపోతుంది కదా.. అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అనే గౌరవం లేకుండా అరెస్ట్ చేయడమేంటన్నారు.

ఉదయనిధిని జైలుకు పంపించాలని కుట్ర పన్నారని.. అందుకే కఠిన సెక్షన్లు బనాయించారని విమర్శించారు. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న బడ్జెట్ సమావేశాలకు ఉదయనిధి రాకుండా చేసేందుకే ఇలాంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. అహంకారం వినాశనానికి దారి తీస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన డీఎంకే కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also Read : సామ్రట్ చౌదరి సీఎంగా పనికి రాడు: ప్రశాంత్ కిషోర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>