కలం, మహబూబ్ నగర్: తన ప్రాణానికి హాని ఉందంటూ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదంటూ మహబూబ్ నగర్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ (Abdul Khader) తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 2019లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, ఎఫ్ఐఆర్ నెంబర్ 73/ 2019, సీసీ నెంబర్ 792/2019లో కిడ్నాప్ కేస్ నమోదు అయిందని ప్రస్తుతం కోర్టులో నడుస్తుందన్నారు. 2023 ఎన్నికల్లో ప్రగతిశీల సమాజ్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశానని, అప్పటినుంచి తనకు లైఫ్ త్రెడ్డింగ్ ఉందంటూ చీఫ్ ఎలక్షన్ కమిషన్, డీజీపీకి లేఖలు రాశానని తెలిపారు.
ఆ లేఖకు స్పందించిన ఉన్నతాధికారులు గత జులై 20వ తేదీన సమగ్ర నివేదిక పంపాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. నేటికీ రిపోర్ట్ పంపలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సెక్యూరిటీ కల్పించమని వేడుకుంటున్న అధికారులు పట్టించుకోకపోవడం తన ప్రాణానికి ఏదైనా హానీ జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

