సంగారెడ్డిలో దారుణం.. భార్యను హత్య చేసి లొంగిపోయిన భర్త

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా నాగల్‌గిద్ద మండల పరిధిలోని ఇరాక్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్యను భర్తే దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇరాక్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్, ఇర్ఫానా (32) దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రమవడంతో, ఆవేశానికి లోనైన భర్త సయ్యద్ ముల్తాన్ భార్య ఇర్ఫానాను హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సమీపంలోని దర్గా వద్ద పడేసి, అక్కడి నుంచి నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>