కలం, వెబ్ డెస్క్: మరో అంతర్జాతీయ స్థాయి సదస్సుకు హైదరాబాద్ వేదికకానుంది. మంగళవారం నుంచి బ్రిక్స్ దేశాల అవినీతి నిరోధక కార్యాచరణ సమావేశాలు భాగ్యనగరంలో ఘనంగా జరగనున్నాయి. భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్-2026 సమ్మిట్ (BRICS Summit)కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మీటింగ్ లో సరిహద్దులు దాటిన అవినీతి నిర్మూలనపై బ్రిక్స్ దేశాలు సుదీర్ఘంగా చర్చించనున్నాయి. దీనిపై తదుపరి తీసుకునే చర్యలు, ఆర్థిక నేరస్థుల అప్పగింత, పారదర్శక పాలనపై సమన్వయానికి సంబంధించి కీలకమైన అంశాలపై చర్చ జరుగనుంది. అలాగే ఈ సమావేశం ద్వారా బ్రిక్స్ దేశాలు తమ మధ్య సంబంధాలను మరింత బలవంతంగా మార్చుకోనున్నాయి.

