కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ (Telangana Govt) మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి (Fisheries) పెంపు, జలాశయాలు, ఇతర నీటి వనరుల్లో చేప పిల్లలు, రొయ్యల పిల్లల విడుదల కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మత్స్యశాఖకు రూ.116 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి డెవలప్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్ పథకం కింద ఈ నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.18.94 కోట్లు కేటాయించారు. ఇప్పుడు అదనంగా రూ.116 కోట్లు విడుదల చేయడంతో మొత్తం కేటాయింపు రూ.134.94 కోట్లకు చేరింది.
Also Read : రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ.. రేవంత్‌పై ఫైర్!
Follow Us On : WhatsApp

