గోదావరి పుష్కరాల కోసం రోడ్ల అభివృద్ధి: ఎమ్మెల్యే పవార్

కలం, నిర్మల్ : వచ్చే ఏడాది 2027 జూన్‌ లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని బాసర ప్రాంతంలో రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.27 కోట్ల నిధులను మంజూరు చేసిందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ (Pawar Ramarao Patel) తెలిపారు. ఆదివారం భైంసాలోని తన నివాసంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ శాఖల ద్వారా ఈ నిధులు మంజూరయ్యాయని చెప్పారు.

ఓని – బాసర రహదారి మరమ్మతులకు రూ.2.55 కోట్లు, గన్నోరా – ఓని రోడ్డుకు రూ.2 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బాసర మహంకాళి ఆలయ రోడ్డుకు రూ.1.20 కోట్లు, కిర్గుల్ – బాసర రోడ్డు కనెక్టివిటీకి రూ.2.80 కోట్లు, బాసర రైల్వే స్టేషన్ – నావేగావ్ రోడ్డుకు రూ.1.35 కోట్లు, మల్కాపూర్ మీదుగా బాసరకు రూ.2.70 కోట్లు, ట్రిపుల్‌ఐటీ – బాలాపూర్ రోడ్డుకు రూ.45 లక్షలు, పెట్రోల్ బంక్ నుంచి శాంఖరి స్కూల్ వరకు రూ.45 లక్షలు కేటాయించినట్లు వివరించారు.

అలాగే ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో బాసర అబాది నాలుగు లేన్ల రహదారిని పుష్కర ఘాట్ వరకు విస్తరించేందుకు రూ.8.50 కోట్లు, బిద్రెల్లి – ధర్మాబాద్ రెండు లేన్ల రహదారికి రూ.4.65 కోట్లు, బాసర బస్టాండ్ రహదారి మరమ్మతులకు రూ.85 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి అన్ని పనులను పూర్తి చేసి, బాసరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే (MLA Ramarao Patel) తెలిపారు.

Also Read : పొన్నం ప్రభాకర్ ఇంట్లో విందు.. సీఎం రేవంత్ హాజరు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>