బ్ర‌హ్మ‌పుత్ర న‌దిలో ప‌డి క‌డ‌ప యువ‌తి మృతి!

క‌లం, వెబ్‌డెస్క్‌: అసోంలో తీవ్ర విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాద‌వ‌శాత్తు బ్ర‌హ్మ‌పుత్ర‌ న‌ది (Brahmaputra River) లో ప‌డి ఏపీలోకి క‌డ‌ప జిల్లాకు చెందిన యువ‌తి మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌డ‌ప జిల్లాలోని పెదముడియం మండ‌లం కొట్టాలకి చెందిన చేతన గువాహటి ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుతోంది. శ‌నివారం స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపేందుకు బ్ర‌హ్మ‌పుత్ర న‌దికి వెళ్లింది. న‌దిని ఆనుకొని ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి న‌దిని చూస్తుండ‌గా ఒక్కసారిగా ఆ ఇల్లు కూలి న‌దిలో కొట్టుకుపోయింది. చేత‌న నీటి ప్ర‌వాహంలో గ‌ల్లంతైంది.

చేత‌న స్నేహితులు స్థానిక అధికారుల‌కు స‌మాచారం అందించ‌గా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి నేడు మృత‌దేహాన్ని వెలికితీశారు. చేత‌న మృతితో స్వ‌గ్రామం కొట్టాల‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. చేత‌న తండ్రి సాయినాథ్ రెడ్డి జ‌మ్మ‌ల‌ముడుకు త‌హ‌సీల్దార్‌గా ప‌ని చేస్తున్నారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి అసోం బ‌య‌లుదేరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>