గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు విడుదల

కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి తీపికబురు అందింది. పన్నుల వాటా కింద ఏపీ (Andhra Pradesh)కి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రాలకు పన్నుల వాటా కింద ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు రూ.1.09 లక్షల కోట్లు విడుదలయ్యాయి. అత్యధికంగా యూపీకి రూ.19,208 కోట్లు, బీహార్ రాష్ట్రానికి రూ.10,845 కోట్లు వెళ్లాయి. జనాభా ప్రాతిపదికన పన్నుల వాటా ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయిస్తున్నారు.

వాటికే ఖర్చు చేయాలని సూచన..

రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. మూలధన వ్యయం, అభివృద్ధి ప్రాజెక్టులకు అధికంగా కేటాయించాలని సూచించింది. అయితే ప్రస్తుతం  ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న ఏపీ, తెలంగాణకు పెద్ద ఉపశమనంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుకు కొంత వెసులుబాటు లభించనుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్బీఐ వద్ద అప్పులు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Also Read : అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>