కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వీబీజీ రామ్‌జీ ఉద్యోగులకు (VB-G RAM G Employees) ఆగస్టు 15లోపు పే స్కేల్ అమలు చేయాలంటూ గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న పెన్‌డౌన్ షట్ డౌన్ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాక్ నేతలు మాట్లాడుతూ.. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతినెల మొదటి తేదీన వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలన్నారు.
పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఆర్డీఎస్ బోర్డు సమావేశంలో ఆమోదించిన అన్ని నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సెలవు దినాలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే నిబంధనల ప్రకారం తగిన ప్రయోజనాలు కల్పించాలన్నారు. సీఆర్డీ కార్యాలయంలోని ఫైనాన్స్ వింగ్, హెచ్ఆర్ వింగ్ మధ్య సమన్వయ లోపాలను నివారించి వేతనాల విడుదలలో ఏర్పడుతున్న జాప్యాన్ని శాశ్వతంగా పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, పదోన్నతులు బదిలీలు, కెరీర్ అడ్వాన్స్మెంట్ పాలసీ అమలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

