కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Srivari Salakatla Brahmotsavam) నిర్వహించనున్నట్లు టీటీడీ (TTD) ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 20 వరకు వేద మంత్రోచ్చారణల నడుమ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 14న సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి నుంచి 10 గంటల వరకు.. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నట్లు వివరించింది.
బ్రహ్మోత్సవ షెడ్యూల్ ఇలా..
ఆగస్టు 15 మంగళవారం సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీవారు భక్తులకు కనువిందు చేయనున్నారు. ఆగస్టు 16న ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంసేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 17న గురువారం ఉదయం 8 గంటలకు సింహవాహన సేవ, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆగస్టు 18 శుక్రవారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మోహినీ అవతారంలో శ్రీవారు..
ఆగస్టు 19 శనివారం రోజున ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 వరకు గరుడ వాహనంపై వైకుంఠవాసుడు కనువిందు చేయనున్నారు. ఆగస్టు 20 ఆదివారం ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథ సేవ, రాత్రి 7 గంటలకు గజవాహనంపై ఊరేగింపు చేయనున్నారు. ఆగస్టు 21 సోమవారం రోజున ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1నుంచి 3 గంటల వరకు స్నేపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
శ్రీవారికి చక్ర స్నానం..
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారిని తిరుమాడ విధుల్లో ఊరేగించనున్నారు. 22న మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీవారి రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. చివరి రోజున ఆగస్టు 23న ఉదయం 6 గంటలనుంచి 9 గంటలవరకు వైఖానస శాస్త్ర ఆగమానుసారం శ్రీవారికి చక్రస్నానం నిర్వహించనున్నారు. రాత్రికి ధ్వజారోహణ కార్యక్రమంలో తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.
Also Read : భోగాపురంలో థింసా ప్రదర్శనకు గిన్నిస్ రికార్డ్!
Follow Us On : WhatsApp

