కలం, వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తొలగింపు అంశంపై తెలంగాణ హైకోర్టు (TG High Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎస్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టపరమైన పాలన కొనసాగాలి తప్ప.. వ్యక్తుల పాలన కాదని స్పష్టం చేసింది. శాంతాశ్రీరామ్ కంపెనీ కేసులో ఈ నెల 27న ఇచ్చిన తీర్పు కాపీని హైకోర్టు విడుదల చేసింది. ఈ తీర్పు కాపీలో కోర్టు కీలక విషయాలు వెల్లడించింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన జరిగిందని న్యాయస్థానం వెల్లడించింది. వివాదాస్పద భూమిలో హైడ్రా (Hydraa) చర్యలు చట్టవిరుద్ధమని పేర్కొంది.
Read Also: ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం
Follow Us On : WhatsApp

