కలం, వెబ్ డెస్క్: సనత్ నగర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రికి (TIMS Hospital) కొత్త పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక నుంచి ఈ ఆసుపత్రిని ‘డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ అని పిలవాలని స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన చెన్నారెడ్డి ప్రజలకు చేసిన సేవలను గుర్తుంచుకుని ఆయన పేరు పెడుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చెన్నారెడ్డి పేరు మీదనే ఉంది. ఇది రెండోది కావడం గమనార్హం.
టిమ్స్ ప్రత్యేకతలు ఇవే..
సుమారు వెయ్యి పడకలతో అత్యంత అధునాత ఆసుపత్రిగా నిర్మిస్తున్న టిమ్స్ (TIMS Hospital) త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇక్కడ చికిత్సలే కాకుండా, వైద్య పరిశోధనలు కూడా జరగనున్నాయి. ఇందుకోసం అనేక భవనాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్‌లో అల్వాల్, సనత్ నగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో టిమ్స్ ఆసుపత్రులు నిర్మాణం అవుతున్నాయి. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే ఔట్ పేషెంట్ ట్రయల్ రన్ నిర్వహించగా.. విజయవంతమైంది.
Read Also: రంగనాథ్ తొలగింపు అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

