కలం, వెబ్డెస్క్: యూరప్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మొరాకో (Morocco) నుంచి స్పెయిన్ (Spain) లోకి ఒకే రోజు ఏకంగా 50 వేల మంది అక్రమ వలసదారులు ప్రవేశించారని స్పెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. సరిహద్దుల్లో భద్రతా వైఫల్యం తారాస్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. భారీ ఎత్తున వలసదారులు స్పెయిన్కు చెందిన స్వయంప్రతిపత్తి ప్రాంతం సియుటాలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు తెలిపారు. సరిహద్దు కంచె దాటి, సముద్రాన్ని ఈదుకుంటూ వేలాది మంది సియుటాలోకి చేరినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహిళలు, పిల్లలతో వలసదారులు పరుగెత్తుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సియుటాలో గతంలో సైతం వలసలు భారీ ఎత్తున జరిగాయి. మొరాకోలో నెలకొన్న నిరుద్యోగం, పేదరికం, రాజకీయ అస్థిరత వల్ల ఈ పరిస్థితి నెలకొంది. కానీ, ఒక్క రోజులో 50 వేలకు పైగా ప్రజలు రావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు. వలసదారులు వచ్చిన ప్రాంతాల్లో మొత్తం జనాభా 85 వేల వరకు ఉంటుంది. ఈ జనాభాలో సగానికి పైగా వలసదారులు ఒక్కరోజులోనే రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే శుక్రవారం నాటికి వలసలు ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. దూసుకొస్తున్న జనాలను అడ్డుకునేందుకు సైన్యం, పోలీసులు బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుల తెలిపారు.
ప్రస్తుతం ఈ భారీ వలసలకు కారణం స్పష్టమైన కారణం తెలియరాలేదు. అయితే సుమారు 5 లక్షల మంది వలసదారులకు చట్టబద్ధ హోదా కల్పిస్తామన్న స్పెయిన్ (Spain) ప్రభుత్వం నిర్ణయం దీనికి కారణం అయి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అక్రమంగా సియుటాలోకి ప్రవేశించిన వారిని గుర్తించి తిరిగి వెనక్కి పంపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వేలల్లో తరలివచ్చిన వారిని గుర్తించి వెనక్కి పంపడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Read Also: ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం
Follow Us On : WhatsApp

