కలం, జగిత్యాల : జగిత్యాల (Jagtial) జిల్లా వెల్గటూరు మండలంలో జూలై 29న 17.5 సెంటి మీటర్ల భారీ వర్షపాతం నమోదవడంతో స్థంబంపల్లి (Stambampalli) గ్రామ పరిధిలోని పెద్దచెరువుకు అధిక వరద ప్రవాహం చేరింది. చెరువు తూముకు ఆనుకుని గతంలో ఏర్పడిన సింక్‌హోల్ ప్రాంతంలో పరిస్థితిని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శుక్రవారం పర్యవేక్షించారు.
భారీ వరదల నేపథ్యంలో సాండ్‌బ్యాగ్స్ దెబ్బతిని చెరువు కట్టకు నష్టం జరిగే అవకాశం ఉన్నందునా రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పెద్దచెరువును సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారుల నుండి వివరాలు తెలుసుకొని, చెరువు భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు కొనసాగించాలని సూచించారు.
ప్రస్తుతం చెరువు కట్ట, తూముకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కోరండ్లపల్లె, అక్షయిపల్లె రోడ్డును అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడివో, డీఈఈ, ఏఈఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Also: ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం
Follow Us On : WhatsApp

