పెద్దపల్లి ప్రజల చిరకాల కల.. బస్సు డిపో: విజయరమణ రావు

కలం, పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణ పనులను (Peddapalli RTC Bus Depot) ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు (Vijaya Ramana Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా వరకు పెద్దపల్లి బస్సు డిపో ప్రారంభించే దిశగా పనులు త్వరత్వరగా జరిగేలా అధికారులకు, కాంట్రాక్టర్ లకు ఎండీ తెలిపారని అన్నారు. బస్సు డిపో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లల్లో బస్సు డిపో ఉన్నప్పటికీ.. మొదటి నుండి పెద్దపల్లి కూడా రెవెన్యూ డివిజన్ అయినప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో డిపో లేకపోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ప్రజలపై ఉన్న మమకారంతో సీఎం 2024 డిసెంబర్ మాసంలో ఇక్కడికి విచ్చేసి యువ వికాసం బహిరంగ సభలో బస్సు డిపో మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, ఆర్టీసీ అధికారులు, పట్టణ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>