స్కావెంజర్స్ కార్మికులకు కనీస వేతనం పెంచాలి: సీఐటీయూ

క‌లం, నిర్మ‌ల్‌: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌లోని సీఐటీయూ (CITU) జిల్లా కార్యాలయంలో గురువారం స్కావెంజర్స్ కార్మికుల సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ.. స్కావెంజర్స్ కార్మికులు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని, వారికి ప్రభుత్వం తక్షణమే కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వారు పనిచేస్తున్న పాఠశాలల్లో ప్రతిరోజూ హాజరు నమోదు చేసే విధానాన్ని అమలు చేయాల‌న్నారు.

కార్మికుల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా 15 మందితో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గంగాధర్, జిల్లా అధ్యక్షుడిగా నారాయణ, జిల్లా కార్యదర్శిగా మల్లేష్, జిల్లా కోశాధికారిగా పోశెట్టి, ఉపాధ్యక్షురాలిగా లలిత, సహాయ కార్యదర్శిగా లక్ష్మి, సభ్యులుగా రాధా, దామియా, రేణుక, సురేష్, గంగవ్వ, సానియా బేగం, రాజవ్వ, రాణి, రాజేశ్వర్, పోశెట్టిలను ఎన్నుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>