కలం, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యాంటీ పేపర్ లీక్ బిల్లు (Anti Paper Leak Bill)కు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఈ బిల్లు లోక్‌సభలో బుధవారం ఆమోదం పొందింది. గురువారం సభలో బిల్లు ప్రవేశపెట్టి చర్చ కోసం 7 గంటల సమయం కేటాయించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నిరసనలపై లాఠీ చార్జ్‌ను ఖండిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలు, ప్రతిపక్ష ఎంపీల వాకౌట్‌ల మధ్యనే రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపించనున్నారు.

