అశోక్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగుల ధ‌ర్నా!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేష‌న్‌పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త‌క్కువ పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అశోక్ న‌గ‌ర్‌, చిక్క‌డ‌ప‌ల్లి లైబ్ర‌రీల వ‌ద్ద ప‌లువురు నిరుద్యోగులు గురువారం రాత్రి నిరుద్యోగులు ధ‌ర్నా (Unemployed Protest) చేప‌ట్టారు. 7437 పోస్టుల‌తో ఇచ్చిన నోటిఫికేష‌న్‌ కాకుండా 19,000 పోస్టులతో కొత్త‌ నోటిఫికేషన్ విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. వ‌ర్షం ప‌డుతున్నా నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. పోస్టుల సంఖ్య పెంచ‌డంతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ వయో పరిమితిని సడలించాల‌ని నిరుద్యోగులు కోరుతున్నారు. పోలీస్ శాఖ‌తో పాటు విద్యాశాఖ‌, గ్రూప్స్ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయాల‌ని వారు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>