కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడితే 08462 – 220183 నెంబరుకు సమాచారం అందించాలని కోరారు. ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేలా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. పరిస్థితిని సమీక్షించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లా యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు.
Read Also: డ్రైవర్ ఇంట్లో కోట్లాది డబ్బు.. కౌంటింగ్ మిషన్లు కూడా ఫెయిల్!
Follow Us On: Sharechat

