వర్షాలు, వరదలపై కలెక్టర్ కీలక చర్యలు.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమాచారం స్వీకరించేందుకు కంట్రోల్ రూమ్ సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని వివరించారు. వర్షాలు, వరదలతో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి అవసరమైన సహాయం పొందాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also: ఉస్మానియా ఆస్ప‌త్రిలో మ‌ద్యం బాటిళ్లు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>