కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరులో జరుగబోయే ఊర పండుగకు (Oora Panduga) గురువారం అంకురార్పణ జరిగింది. సర్వ సమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఆగస్టు 2వ తేదిన ఊర పండుగను పురస్కరించుకొని శుభసూచకంగా నిజామాబాద్ (Nizamabad) (ఇందూర్) సర్వసమాజ్ కమిటీ శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పసుపు, కుంకుమలు పూలతో బండారు పోశారు. బండారు పోయడంతో ఊర పండుగ క్రతువు లాంఛనంగా ఆరంభమైంది. కల్లు సాకలు సమర్పించారు. ఈ సందర్బంగా దున్నపోతునూ ఊరి మీదకు వదిలారు.
ఈరోజు నుంచి గ్రామ దేవతల విగ్రహాలు తయారీ ప్రారంభిస్తారు. ఊర పండగ కోసం ఏర్పాట్లు షురూ అయ్యాయి. అలాగే అనాదిగా వస్తున్న ఆచారం పెద్దల ద్వారా ఆనవాయితీగా వస్తున్న ఊర పండుగ ద్వారా గ్రామ దేవతల ఊరేగింపులో ప్రజలందరు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామ దేవతల తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలని సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ ఊర పండుగతో పాడిపంటలు, పశుసంపద వృద్ధి చెందాలని, పిల్లలు, పెద్దలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలందరికీ అష్టైశ్వరాలు కలగాలని, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉండాలని ఈ పండుగ నిర్వహిస్తారని వివరించారు.
బండారు పోసే కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్, శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోరడి కిరణ్, ఉపాధ్యక్షులు కార్పొరేటర్ మల్కాయి మహేందర్, మాజీ కార్పొరేటర్ రామాడ్గు బాలకిషన్, సెక్రటరీ ధామ ఇంద్రకరణ్, పెద్ద కాపులు మల్కాయి లక్ష్మీనారాయణ, గంట పెద్ద నర్సయ్య, స్వామి, లింబాద్రి స్వామి, కొరడీ చిన్న నర్సయ్య, కోర్వ భూపాల్, పెద్ద మనుషులు సుంకేటి ప్రవీణ్, మల్కాయి భోజన్న, జానకంపేట్ అశోక్, మల్కాయి సుదర్శన్, పసుల రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Also: 2034 వరకు నేనే ముఖ్యమంత్రి: రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat

