నిర్మల్ జిల్లాలో 98.6 శాతం డిజిటలైజేషన్ పూర్తి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 98.6 శాతం పూర్తయిందని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఖానాపూర్ నియోజకవర్గంలో డిజిటలైజేషన్ వంద శాతం పూర్తయిందని వెల్లడించారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రజల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతిఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అన్ని రాజకీయ పార్టీల సూచనలు పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. పారదర్శకతతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్‌వో రాథోడ్ రమేశ్, ఆర్‌డీఓ దేవీదాస్‌, అధికారులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>