డబ్బుల కోసం దారుణం.. బావిలోకి తోసి హత్య

కలం, నిర్మల్: ఓ యువకుడి మృతి వెనుక సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి అక్రమంగా డబ్బులు తన ఖాతాకు బదిలీ చేసుకున్న మరో వ్యక్తి, విషయం బయటపడటంతో అతడిని బావిలోకి తోసి హత్య చేసిన ఘటనను కుంటాల పోలీసులు ఛేదించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్ బుధవారం వివరాలు తెలిపారు. జిల్లాలోని (Nirmal) కుంటాల మండలం దౌనేల్లి గ్రామానికి చెందిన పున్న మహేందర్ (30) అనే యువకుడు గత ఏప్రిల్ 23న బావిలో మృతదేహంగా కనిపించాడు. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటనపై మృతుడి తల్లి జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మృతుడు మహేందర్ బ్యాంకు ఖాతా నుంచి నిందితుడి తన ఖాతాకు డబ్బులు బదిలీ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహేందర్ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఏప్రిల్ 18న మహేందర్‌ను గ్రామ శివారులోని బావి వద్దకు తీసుకెళ్లి వెనుక నుంచి తోసివేయడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నరేష్‌శ్ పాటు పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>