కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ (Mahabubnagar) డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా చేపట్టిన 60 రోజుల “గో గ్రీన్ గణేష్” పర్యావరణ అవగాహన ప్రచారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్‌లోని విజన్ కాలేజ్‌లో అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పిఓపి గణేష్ విగ్రహాల వల్ల కలిగే పర్యావరణ నష్టం గురించి వివరించి, సహజ మట్టి గణేష్ విగ్రహాలను వినియోగించాలని అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో గ్రీన్ గణేష్ ప్రతిజ్ఞ చేయించి పర్యావరణ పరిరక్షణకు సంకల్పం చేయించారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో 60 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ప్రతి ఒక్కరూ సహజ మట్టి గణేష్ విగ్రహాలనే వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సంజీవ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుమోహన్ , ఇన్చార్జ్ ఆరిఫ్ , NSUI నాయకులు అహ్మద్ , కాంగ్రెస్ నాయకులు బూరేమోని చందు యాదవ్ ,చంద్ర కిరణ్ గౌడ్, టౌన్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

