మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. కోర్టు కీలక తీర్పు

కలం, జగిత్యాల: మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో (Jagtial POCSO Case) జగిత్యాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి (ఎఫ్‌ఏసీ), ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఫర్ పోక్సో కేసెస్ న్యాయమూర్తి రత్న పద్మావతి కీలక తీర్పు వెలువరించారు. నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.6,500 జరిమానా విధించారు. అలాగే బాధిత మైనర్ బాలికకు రూ.50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల మందుల రాజేష్ (27) అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించి 2024 సంవత్సరంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి డీఎస్పీ రఘుచందర్, అప్పటి ఎస్‌ఐ సదాకర్ దర్యాప్తు నిర్వహించి నిందితుడికి సంబంధించిన ఆధారాలను ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకు సమర్పించారు.

అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు, కోర్టు డ్యూటీ అధికారులు సాక్షులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించి, సాక్షులను విచారించిన అనంతరం న్యాయమూర్తి రత్న పద్మావతి నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.6,500 జరిమానా విధించారు. బాధిత మైనర్ బాలికకు రూ.50,000 పరిహారం అందించాలని కూడా తీర్పులో పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు, దర్యాప్తు అధికారి అప్పటి డీఎస్పీ రఘుచందర్, ఎస్‌ఐ సదాకర్, సీఎంఎస్ ఎస్‌ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ నరేష్, సీఎంఎస్ కానిస్టేబుల్ శ్రీధర్‌లను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>